The real Life story of G.D.naidu || కోయంబత్తూరు సృష్టి కర్త జి.డి. నాయుడు ట్రూ స్టోరీ ||





The Real Life Story Of G.D.Naidu

జి.డి. నాయుడు  కోయంబత్తూర్ యొక్క సంపద సృష్టికర్త ఇతను ఒక గొప్ప ఇంజనీర్ అలాగే ఒక గొప్ప ఆవిష్కర్త కూడా ఇతన్ని ఎడిసన్ ఆఫ్ ఇండియా అని  కూడా పిలుస్తారు భారతదేశంలో మొట్టమొదటి ఎలక్ట్రిక్ మోటార్‌ను తయారు చేసిన ఘనత ఇతనిది అంతెకాదు పండ్ల రసం తీసే సాధనం , ఎలక్ట్రానిక్ కాలిక్యులేటర్ , కిరోసిన్ తో నడిచే ఫ్యాన్ , అతి సన్నటి షెవింగ్ బ్లేడ్ , ట్యాంపర్ ప్రూఫ్ ఓటు రికార్డింగ్ మిషన్ , ఇలాంటివి ఎన్నో ఆవిష్కరణలు  ఇతను చేసాడు. 

 (గోపాలస్వామి దొరైస్వామి నాయుడు)

జి.డి.నాయుడు పూర్తి పేరు (గోపాలస్వామి దొరైస్వామి నాయుడు) జి.డి.నాయుడు 1893 మార్చి 23న తమిళనాడు రాష్ట్రం కోయంబత్తూర్ లోని కలంగల్ గ్రామంలో జన్మించాడు నాయుడు గారి తండ్రి పేరు (గోపాలస్వామి నాయుడు) అతను ఒక సాధారణ రైతు  జి.డి.నాయుడి తల్లి తన చిన్నతనంలోనే చనిపోయింది తల్లి లేకపోవటంతో నాయుడుని తన తండ్రే  పెంచి పెద్దచేసాడు. జి.డి.నాయుడు చిన్నతనంలో చాలా అల్లరి చేసేవాడు స్కూల్ టైమ్ లో కూడా ఎక్కువగా క్లాసెస్ కి అటేడ్ అయ్యేవాడు కాదు తరగతి గదిలో ఉపాధ్యాయులతో దురుసుగా ప్రవర్తించేవాడు వాలపై ఇసుకను విసిరేవాడు అలా ఇసుకను విసరడం వల్ల ఉపాధ్యాయులు అతన్ని శిక్షించేవారు  జి.డి.నాయుడు చదువుపై పెద్దగా ఆసక్తి చూపించేవాడు కాదు అందువల్ల తను తరచుగా క్లాసులకి అటేడ్ అయ్యేవాడు కాదు తను తరచుగా క్లాసులకి హాజరు కాకపోవటంతో చాలా ఇబ్బందులు పడేవాడు దాంతో అతను 3వ తగతి లోనే తన చదువును ఆపేసాడు.

జి.డి.నాయుడు తన తండ్రితో కలిసి పొలం పనులకు వెళ్ళేవాడు ఒక రోజు ఒక బ్రిటిష్ అధికారి తన మోటార్ సైకిల్ పై ఆ గ్రామానికి వచ్చాడు బ్రిటిష్ అధికారి నడుపుతున్న మోటార్ సైకిల్ ని చూసిన జి.డి.నాయుడు అసలు ఎద్దులు,గుర్రాలు లేకుండా బండిని ఎలా నడుపుతున్నాడు అని ఆశ్చర్యపోయాడు ఇంతలో మోటార్ సైకిల్ లో ఇబ్బంది రావటంతో బ్రిటిష్ అధికారి బండిని ఆపి బాగుచేస్తున్నాడు అది చూసిన జి.డి.నాయుడుకి మోటర్ సైకిల్ ఎలా నడుస్తుందో తెలుసుకోవాలన్న ఆసక్తి కలిగింది తను ఎలాగైనా ఒక మోటర్ సైకిల్ ని కొనాలనుకున్నాడు దానికోసం కోయంబత్తూరుకి వెల్లి అక్కడ ఒక హోటల్లో వెయిటర్ గా పనిచేసాడు తను పనిచేస్తు వచ్చిన డబ్బులో కొంత మోటార్ సైకిల్ కొనడం కోసం దాచుకునేవాడు 3 సవత్సరాలు కష్టపడి పనిచేసి దాచుకున్న  డబ్బులతో ఒక మోటార్ సైకిల్ ని కొన్నాడు మోటార్ సైకిల్ ని కొన్నతరువాత అది ఎలా పనిచేస్తుందో తెలుసుకోవడం కోసం మోటార్ సైకిల్ భాగాలను విడదీసి మల్లి తిరిగి జోడించేవాడు అలా చేయడం వల్ల మోటార్ సైకిల్ యొక్క మెకానిజం గురించీ తను తెలుసుకున్నాడు.

G.D.Naidu's First Vehicle

మోటార్ సైకిల్ ఎలా పనిచేస్తుందో తెలుసుకున్నతరువాత.  జి.డి.నాయుడు కోయంబత్తూర్ లో రాబర్ట్ స్టాన్స్ అనే ఒక బ్రిటిష్ వ్యాపారవేత్త దగ్గర వంటవాడిగా పనిలో చేరాడు రాబర్ట్ స్టాన్స్ చేవ్రొలెట్ కంపెనీ యొక్క ట్రక్కులు మరియు బస్సుల డీలర్.  ఆ రోజుల్లో ఒక సామాన్య మానవుడు ఎక్కడికైనా ప్రయాణించాలంటే ఎద్దుల బండి లేదు గుర్రపు బండ్లను ఎక్కువగా వాడేవాడు దానివల్ల ఒక చోటునుండి మరోచోటుకు వెళ్ళాలంటే ఎక్కువ సమయం పట్టేది 1920లో జి.డి.నాయుడు సామాన్య మానవుడి ప్రయాణాన్ని సులభతరం చేయాలన్న ఆలోచనతో రాబర్ట్ స్టాన్స్ దగ్గరినుండి లోన్ ద్వారా ఓక బస్సును కొన్నాడు తను కొన్న ఆ ఒక్క బస్సుతో ట్రాన్స్ పోర్ట్ బిజినెస్ ని ప్రారంబించాడు ఆ బస్సు ని పొల్లాచ్చి మరియు పళని మధ్య నడిపేవాడు అలా ఒక్క బస్సు నుండి ప్రారంబించిన అతను 1933లో 280 బస్సులతో ( U M S ) యూనివర్సల్  మోటార్ సర్వీస్‌ అనే సంస్థను స్థాపించాడు ఈ సంస్థ దక్షిణ భారతదేశంలో మొట్టమొదటి అతిపెద్ద బస్ జంక్షన్ గా పేరుగాంచింది.

( U M S )ని స్థాపించిన తరువాత నాయుడు విదేశాలకు వెళ్ళాడు న్యూయార్క్ , లండన్ , మరియు బెల్జియం దేశాలను సందర్శించాడు న్యూయార్క్ , మరియు లండన్ , సందర్శించినప్పుడు అక్కడి బస్సు వ్యవస్థపై అధ్యయనం చేసాడు పరిశుభ్రత అనేది ఓక యజమానికి మాత్రమే కాదు అక్కడ  పనిచేసే గుమస్తా మరియు డ్రైవర్లకు కూడా ఉండాలి అని తెలుసుకున్నాడు.   ఆ తరువాత బెల్జియంకు వెళ్ళాడు బెల్జియంలో తను ఒక ప్రయోగాన్ని చేసాడు బొమ్మ కారు నుండి తీసిన మోటార్ కు షేవింగ్ రేజర్ ను అమర్చి ఎలక్ట్రిక్ రేజర్‌ను కనుగొన్నాడు ఈ ప్రయోగమే (రసంత్ ఎలక్ట్రిక్ రేజర్) పుట్టుకకు దారితీసింది ప్రయోగం విజయవంతం కావటంతో ఎలక్ట్రిక్ రేజర్‌ డిజైన్‌పై పేటెంట్ పొందాడు ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్ని పెద్ద సంస్థలు అతని డిజైన్‌ను కొనాలనుకున్నాయి కానీ నాయుడు తన ఆవిష్కరణను తన దేశానికి అందించాలనుకున్నాడు దానికోసం జర్మనీ నుండి మోటార్లు మరియు స్వీడన్ నుండి స్టీల్ ని దిగుమతి చేసుకున్నాడు తను దిగుమతి చేసుకున్న స్టీల్ మరియు మోటార్లతో పెద్ద ఎత్తున రసంత్ అనే పేరుతో ఎలక్ట్రిక్ రేజర్లను తయారుచేశాడు.

రసంత్ ఎలక్ట్రిక్ రేజర్‌ను లండన్ లో ప్రవేశపెట్టిన నెలరోజుల్లోనే చాలా బాగా అమ్ముడయ్యాయి కానీ భారతదేశంలో బ్రిటిషర్లు అనేక అడ్డంకులు సృష్టించడంతో నాయుడు పెద్దగా విజయం సాధించలేకపోయాడు. అయినప్పటికీ అతనిలో పట్టుదల ఏమాత్రం తగ్గలేదు 1937లో D.బాలసుందరం నాయుడుతో కలిసి భారతదేశంలో మొట్టమొదటి స్వదేశీ ఎలక్ట్రిక్ మోటారును తయారుచేశాడు ఎలక్ట్రిక్ మోటార్ ప్రయోగం విజయవంతం కావటంతో G.D.నాయుడు ఓక పెద్ద మోటర్ తయారీదారుడిగా మారడాన్ని ఎవరూ ఆపలేకపోయారు. G.D.నాయుడి ఇతర ఆవిష్కరణలో 16mm ఫిల్మ్ ప్రొజెక్టర్ , ఎలక్ట్రానిక్ కాలిక్యులేటర్ , ఓటు రికార్డింగ్ మిషన్ , కిరోసిన్ తో నడిచే ఫ్యాన్ , ఫ్రూట్ జ్యూస్ ఎక్స్‌ట్రాక్టర్ , నాణెంతో పనిచేసే ఫోనోగ్రాఫ్‌ , ఇలాంటివి ఎన్నో ఆవిష్కరణలు అతను చేసాడు 1952లో టూ సీటర్  పెట్రోల్ ఇంజన్ కారును కేవలం 2000 రూపాయల ధరలో తయారు చేసాడు కాని ప్రభుత్వం దానికి సంబంధించిన లైసెన్స్‌ను ఇవ్వడానికి నిరాకరించడం వలన టూ సీటర్  పెట్రోల్ ఇంజన్ కార్ తయారీ నిలిపివేయబడింది.

జి.డి.నాయుడు ఆవిష్కరణలు , మరియు మెకానికల్ , మోటారు పరిశ్రమ , రంగాల్లో మాత్రమే కాకుండా హైబ్రిడ్ మొక్కలు మరియు విత్తనాలపై కూడా పరిశోధనలు చేసాడు అతను చేసిన ఆవిష్కరణల గుర్తుగా 1967లో నాయుడు పేరుమీద G.D.నాయుడు సైన్స్ మ్యూజియం ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్ ను కోయంబత్తూర్ లో స్థాపించారు అంతేకాకుండా భారతదేశంలో మొట్టమొదటి పాలిటెక్నిక్ కళాశాల మరియు ఆర్థర్ హోప్ ఇంజనీరింగ్ కాలేజీలను స్థాపించాడు. నాయుడు కళాశాల ప్రిన్సిపాల్‌గా కూడా పనిచేసాడు నాయుడు పనిచేసే సమయంలో నాలుగుసంవత్సరాల కోర్సును రెండు సంవత్సరాలోనే పూర్తయ్యేలా ఒక ప్రపోజల్ ను తీసుకొచ్చాడు కానీ అప్పటి బ్రిటిష్ ప్రభుత్వం దానికి అంగీకరిచలేదు దాంతో నాయుడు ప్రిన్సిపాల్ పధవికి రాజీనామా చేశాడు. అంతే కాదు G.D.నాయుడు యొక్క ఆవిష్కరణలు పెద్దగా దేశానికి ప్రయోజనం చేకూర్చకపోవడానికి కారణం కూడా అప్పటి బ్రిటిష్ ప్రభుత్వమే అంతేకాకుండా ఆరోజుల్లో అత్యధికంగా పన్ను చెల్లించేవారిలో G.D.నాయుడు కూడా ఒకడు మూడవ తరగతి కూడా పూర్తిచేయని నాయుడు ఆవిష్కరణలు మరియు మోటారు పరిశ్రమ లాంటి వివిధ రంగాల్లో అద్భుతంగా రాణించాడు అంతేకాదు ఎడిసన్ ఆఫ్ ఇండియా మరియు కోయంబత్తూర్ యొక్క సంపద సృష్టికర్తగా పేరుగాంచాడు అలాంటి ఒక గొప్పవ్యక్తి తను చనిపోయే చివరి రోజుల్లో పన్ను ఎగవేతదారుడిగా ఆరోపణలు ఎదుర్కోవాల్సి వచ్చింది G.D.నాయుడు జనవరి 4 - 1974న గుండెపోటుతో మరణించాడు. 


మరిన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మా స్టోరీ బ్లాగ్ ను ఫాలో కాండీ viharizoom.blogspot.com




కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అజాద్ హింద్ ఫౌజ్

Dr. Vashishtha Narayan Singh True Story Part-3 డాక్టర్ వశిష్ఠ నారాయణ్ సింగ్ ట్రూ స్టోరీ