Dr. Vashishtha Narayan Singh True Story Part-3 డాక్టర్ వశిష్ఠ నారాయణ్ సింగ్ ట్రూ స్టోరీ
Dr.vashishtha Narayan Singh
డా.వశిష్ఠ నారాయణ్ సింగ్
ఈ స్టోరీ మూడు భాగాలుగా రాయబడింది Part-1 చదివిన తరువాత Part-2 Part-3 ని చదవండి అలగైతేనే ఈ కథని మీరు బాగా అర్థం చేసుకోగలుగుతారు.
PART-3
1973 లో వశిష్ఠ నారాయణ్ సింగ్ పెళ్లి వందనా రాణి సింగ్ తో జరిగింది పెళ్లి తరువాత వశిష్ఠ నారాయణ్ సింగ్ ఇండియా లోనే ఉంటూ ( ఐ.ఐ.టి , కాన్పూర్ ) ( టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్ , ముంబై ) ( ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూట్ , కోల్కతా ) లో ప్రొఫెసర్ గ పని చేసాడు ప్రొఫెసర్ గ పనిచేస్తూనే తన రీసెర్చ్ ని కొనసాగించాడు పెళ్లి తరువాత తన ఎక్కువ సమయాన్ని రీసెర్చ్ పైనే గడిపేవాడు తన బార్య కోసం కొంత సమయాన్ని కూడా కేటాయించెవాడు కాదు అలా ఎక్కువ సమయాన్ని తన పరిశోధనల పైనే గడపడంతో వశిష్ఠ నారాయణ్ సింగ్ కీ స్కిజోఫ్రెనియా అనే వ్యాధి వచ్చింది తనలో తను మాట్లాడుకోవడం , లేని వారిని ఉన్నట్టుగా ఉహించుకోవడం , వినపడని శేబ్ధాలని వినపడుతున్నాయి అనడం , ఎక్కువగా యెవరి తోని మాట్లాడకపోవడం , లాంటివి చేసేవాడు అది గమనించిన వాల కుటుంబసబ్యులు వెంటనే రాంచి లో ని డేవిడ్ క్లినిక్ లో జాయిన్ చేసారు డేవిడ్ క్లినిక్ లో ట్రీట్మెంట్ తరువాత తను కొద్దిగా కోలుకొని మామూలు మనిషిగా అయ్యాడు ఆ తరువాత కొన్ని రోజులు Netarhat Residential School లో మాక్స్ ప్రొఫెసర్ గా పని చేసాడు తను జాయిన్ ఐన కొద్ది రోజులకి వాళ్ల నాన్న అనరోగ్యం కారణంగా చనిపోయాడు అదేసమయంలో తను చేసిన రీసెర్చ్ పేపర్లని దొంగిలించి ఇత్తరులు లాభం పొందేవారు దాంతో వశిష్ఠ నారాయణ్ సింగ్ మరింత మానసిక ఒత్తిడికి గురయ్యాడు అదే సమయంలో తన వ్యాధితో విసుగెత్తిన తన బార్యా తననూ వదిలి వెళ్ళిపోయింది.
తన బార్యా తననూ వదిలి వెళ్లిపోయిందన్న బాధతో వశిష్ఠ నారాయణ్ సింగ్ మల్లి స్కిజోఫ్రీనియ బారిన పడ్డాడు అప్పటి జనతా పార్టీ హెల్త్ మినిస్టర్ జాబీర్ హుస్సేన్ సహాయంతో మల్లి రాంచీ లోని డేవిడ్ క్లినిక్ లో జాయిన్ చేసారు జాయిన్ చేసిన కొద్ది రోజులకి ప్రభుత్వం మారింది ఆ తరువాత వొచ్చిన ప్రభుత్వం అతనిని అంతగా పట్టించుకోలేదు దాంతో అతనిని మెంటల్ హాస్పిటల్ కి మార్చారు అక్కడే కొద్ది రోజులు ఉండి ట్రిట్మెంట్ తీసుకున్నాడు అయిన ఫలితం లేకపోవడం తో వశిష్ఠ నారాయణ్ సింగ్ తమ్ముడు అయోధ్య ప్రసాద్ తనని పూణే కి తీసుకెళ్ళాడు అక్కడ కొంతమంది డాక్టర్లని కలిసి వశిష్ఠ నారాయణ్ సింగ్ కి ఉన్న వ్యాధి గురించి చెప్పాడు డాక్టర్లని కలిసి తిరిగి వస్తుండగా దారి మద్యలో మధ్య ప్రదేశ్ లోని గడర్వర స్టేషన్ లో తన తమ్ముడికి తెలియకుండా ట్రైన్ దిగిపోతాడు కొంతసేపటికి చూస్తే వశిష్ఠ నారాయణ్ సింగ్ అక్కడ లేడు అన్నకోసం తమ్ముడు అయోధ్య ప్రసాద్ చుట్టుపక్కల మొత్తం వెతికాడు ఎంతకీ వశిష్ఠ నారాయణ్ సింగ్ జాడ కనపడక పోయేసరికి విషయాన్ని కుటుంబ సభ్యులకు చెప్పాడు వెంటనే వాల కుటుంబసభ్యులు వశిష్ఠ నారాయణ్ సింగ్ కోసం అన్ని చోట్ల గాలించారు ఎంతకీ వశిష్ఠ నారాయణ్ సింగ్ జాడ దొరకలేదు. అలా కొద్దిరోజుల తరువాత 1993లో సరన్ జిల్లా దొరిగంజ్ లో మాసిన బట్టలు పెరిగిన గడ్డం తో కనిపించాడు వెంటనే అక్కడి నుండి తీసుకెల్లి బెంగళూరు లోని (నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ & న్యూరో సైన్సెస్) లో జాయిన్ చేసారు సంవత్సరం ట్రీట్మెంట్ తీసుకున్న ఆయన లో ఎ మార్పు లేదు వ్యాధి తగ్గకపోవడంతో డిశ్చార్జ్ చేసి ఇంటికి పంపించారు ఇంటికి వచ్చిన తరువాతకూడా వశిష్ఠ నారాయణ్ సింగ్ తనలోతాను మాట్లాడుకోవడం లేని వారిని ఉన్నటుగా ఉహించుకోవడం ఎవరితోని ఎక్కువగా మాట్లాడక పోవడం లాంటివి చేసేవాడు అలా కొద్ది రోజులు గడిచాక వశిష్ఠ నారాయణ్ సింగ్ ఆరోగ్యం మరింతగా క్షీణించింది వెంటనే మల్లి పాట్నా మెడికల్ కాలేజీ అండ్ హాస్పిటల్ లో జాయిన్ చేసారు జాయిన్ చేసిన కొద్ది రోజులకి అదే హాస్పిటల్ లో వశిష్ఠ నారాయణ్ సింగ్ చనిపోయాడు 14 November 2019 న ఆఖరి వీడ్కోలు చెప్పి తిరిగి రాణి లోకాలకి వెళ్ళిపోయాడు ఒక సాధారణ మైన కుటుంబంలో పుట్టిన ఆయన భారత దేశం గర్వించే స్థాయీకి వెళ్ళాడు అంతటి గొప్ప వ్యక్తిని చనిపోయిన తరువాత ఇంటికి తీసుకు వెల్దాం అన్న అంబులెన్స్ లు లేవని హాస్పిటల్ బయట ఒక అనాధ శేవం లాగా పడుకో బెట్టారు మన భారత దేశాన్ని గర్విచే స్థాయీకి తీసుకెళ్ళిన ఆయనకి అంబులెన్స్ లు దొరకని పరిస్థితి.
END THE STORY
మరిన్ని ఇంట్రెస్టింగ్ stories కోసం మా బ్లాగ్ ని Follow కాండీ viharizoom.blogspot.com
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి